హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్‌లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్‌లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఒకరు ఓ యువతి..మరొకరు డ్రగ్స్ కొరియర్. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఎవరో తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి యజమాని, వైద్యుడి కూతురుగా ఆమెను గుర్తించారు. ఆమె కూడా స్వయంగా డాక్టర్(Doctor). కానీ చేతిలో కావాల్సినంత డబ్బు ఉండటంతో దాన్ని దురలవాట్ల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ముంబై(Mumbai)లోని ఓ పబ్‌లో పరిచయం అయిన వ్యక్తితో డ్రగ్స్(drug) అలవాటు చేసుకుని దాన్ని వ్యసనంగా మార్చుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఆమె ఒక్క ఏడాదిలో ఏకంగా 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసింది. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి.. రిహాబిలిటేషన్(Rehabilitation) సెంటర్ కు తరలించాల్సి వచ్చింది. తన కూతురు దారి తప్పిందని డ్రగ్స్‌కు బానిసగా మారిందని ఆ బిజీ డాక్టర్ తండ్రికి తెలుసో లేదో.. తెలిసినా వారించలేకపోయారో.. వారించినా ఆమె వినలేదో మరి. ఆమె పేరు పోలీసులు బయటకు వెల్లడించలేదు.

Updated On 10 May 2025 7:04 AM GMT
ehatv

ehatv

Next Story