తెలంగాణలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హయత్‌నగర్‌లోని తన నివాసంలో సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.ఘటన అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న కృష్ణ చైతన్యను వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story