I Bomma Ravi: Should encounter I Bomma Ravi..?

ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి చాలా వార్తలు చూస్తున్నాం. ఆయనను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. గతంలో రవి పోలీసులకు కూడా సవాలు చేశారు. దమ్ము ఉంటే తనని అరెస్ట్ చేయండి అంటూ, ఆ స్థాయిలో అతని దగ్గర నుంచి సవాలు తీసుకున్న తర్వాత, సినిమా ఇండస్ట్రీకి కూడా అతను ఒక ప్రమాదంగా మారిన తర్వాత, పైరసీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి నష్టం చేస్తున్నారు అంటూ అనేకమంది నిర్మాతలు పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత, రవి కోసం చాలా కాలంగా పోలీసులు వెతుకుతున్నారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత, పోలీసులు అతన్ని పట్టుకోవడం పైన సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, అనేకమంది సోషల్ మీడియా వేదికగా రవి అరెస్టుని ఖండిస్తున్నారు. రవి చేసిన తప్పు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మనం కూడా మాట్లాడుకున్నాం చాలా మంది ఇప్పటికీ అతను చేసింది తప్పేం కాదు అని మాట్లాడుతున్నారు, అఫ్కోర్స్ చట్టబద్ధంగా సరైనది కాదు, చట్ట ప్రకారం అలా చేసి ఉండాల్సింది కాదు, అలా చేయడానికి ఎవరైనా తప్పు పట్టాల్సిందే, పోలీసులు అరెస్ట్ చేసిన తీరును కూడా అభినందించాల్సిందే, కానీ సమస్యకు కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన పెద్దలందరినీ కూర్చోబెట్టి, పోలీస్ అధికారులు మేము ఒక ఘనత సాధించేసాం, ఇతన్ని పట్టుకున్నాం అని చెప్పారు. అతని దగ్గర నుంచి పైరసీకి సంబంధించిన డేటా అంతా తీసుకున్నారు, 50 లక్షల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా కూడా అతని దగ్గర ఉండడం అనేది ఖచ్చితంగా ప్రమాదకరమైన అంశం. అయితే ఈ అంశంలో సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవుతున్న తీరు కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ప్రజలు ఇంకా అసహ్యించుకునేలా ఉంది, సినిమా ఇండస్ట్రీ బాధిత ఇండస్ట్రీగా ప్రజలు ప్రేక్షకులు ఎవరూ చూడట్లే, పర్టికులర్‌గా ఐబొమ్మ రవి అరెస్ట్ కి ఆ స్థాయిలో మద్దతు రావడానికి కారణం ఏంటంటే, సినిమా టికెట్లు రేట్లు పెంచడం, సినిమా టికెట్ల రేట్లు పెంచి, సామాన్య ప్రజలను దోచుకోవడం కారణంగా, వాళ్ళంతా, అంత డబ్బులు పెట్టి మాల్స్ కి వెళ్లి, మల్టీప్లెక్స్‌కి వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేక, ఇంటర్నెట్‌లో ఐ బొమ్మ లాంటి సైట్స్ లో సినిమాలు చూస్తూ ఉన్నారు. అక్కడ అందుబాటులో మాకు థియేటర్స్ లో, మా మేము కొనుగోలు చేసే ధరల్లో, సినిమా అందుబాటులో ఉంటే మాకు ఇలా చిన్న చిన్న స్క్రీన్స్ లో, కంప్యూటర్స్ లో, చిన్న టీవీలో, సినిమాని చూసే అవసరం ఉండదు కదా, మమ్మల్ని మల్టీప్లెక్స్ కి, మమ్మల్ని థియేటర్స్ కి దూరం చేస్తుంది ఇండస్ట్రీనే కదా లాంటి ఆవేదన సగటు ప్రేక్షకుడిలో ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story