Professor's sexual harassment, rape of three students... Shocking details in death certificate...!

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్, వేధింపులకు గురై మరణించిన హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది, అందులో ఆమె తన కళాశాలలో ఒక ప్రొఫెసర్ తన పట్ల పాల్పడిన లైంగిక వేధింపుల గురించి వివరించింది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని డిసెంబర్ 26న మరణించగా, ఆమె తండ్రి ఫిర్యాదు ఆధారంగా గురువారం కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 18న తన కుమార్తెపై హర్షిత, ఆకృతి కొమోలికా అనే ముగ్గురు విద్యార్థులు దాడి చేశారని ఫిర్యాదులో తండ్రి పేర్కొన్నారు. విషయం బయటకు చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అలాగే కళాశాలలో ఒక ప్రొఫెసర్ అశోక్ కుమార్ ఆమెతో "అశ్లీల చర్యలకు" పాల్పడేవాడని ఫిర్యాదు చేశాడు. లైంగిక వేధింపుల తర్వాత విద్యార్థిని అనారోగ్యానికి గురైంది. డిసెంబర్ 26న లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియోలో, ఆసుపత్రి బెడ్ మీద పడి మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ ప్రొఫెసర్ ఆమెను విచారిస్తూ ఎవరు వేధించారు అని అడగగా.."అశోక్ సర్" అని చెప్తుంది. ప్రొఫెసర్ ఏమి చేస్తారని అడిగినప్పుడు, ఆమె, అతను వింత పనులు చేస్తాడు, నా వెంట పడతాడు" అని సమాధానం ఇచ్చింది. ప్రొఫెసర్ తన ఛాతీ వైపు చూపిస్తూ తనను తాకుతాడని అమ్మాయి చెప్పింది. ముగ్గురు విద్యార్థులపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యా సంస్థల (ర్యాగింగ్ నిషేధం) చట్టం, 2009 సెక్షన్ల కింద ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.


