మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చిన ఉదంతం జమ్మూలోని గంగ్యాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో మైనర్‌పై అత్యాచారం, పోక్సో చట్టం, బెదిరింపు కేసు నమోదైంది.

Jammu minor girl misdeeds and threat to keep quiet and whole secret revealed after getting pregnant
మైనర్ బాలిక(Minor Girl)పై అత్యాచారం(Rape) చేసి గర్భం దాల్చిన ఉదంతం జమ్మూ(Jammu)లోని గంగ్యాల్(Gangyal) ప్రాంతంలో వెలుగు చూసింది. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు(Police).. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో మైనర్‌పై అత్యాచారం, పోక్సో చట్టం, బెదిరింపు కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్(Uttarpradesh)కు చెందిన వలస కార్మిక కుటుంబం సోమవారం నాడు తమ 15 ఏళ్ల మైనర్ కుమార్తె కడుపునొప్పితో బాధపడుతుండటంతో బాలికను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా నాలుగు నెలల గర్భిణి అని తేలింది.
బాలిక మైనర్ కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు గాంగ్యాల్ పోలీసుల బృందం ఆసుపత్రికి చేరుకుంది. బీహార్(Bihar)కు చెందిన జై ప్రకాష్(Jai Prakash) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. ఈ కారణంగా తన బాధను ఎవరికీ చెప్పలేదని బాలిక పేర్కొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ప్రస్తుతం బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు.
