తెలిసీతెలియని వయసులో ప్రేమ.. పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యలు..!

నాలుగు నెలల ప్రేమ. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో నాలుగు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), బాలిక(16). విషయం తెలిసి ప్రేమపెళ్లికి అంగీకరించని పెద్దలు.. దీంతో ఇటీవలే మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇరువురు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డ ప్రేమజంట. సోమవారం రోజు బాలికకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మహేష్ బెదిరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై, మనస్తాపంతో మంగళవారం రోజు ఉరేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఈరోజు ఉదయం పెట్రోల్ పోసుకొని మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరి తల్లిదండ్రుల ఇళ్లలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story