Man cheats woman: భార్యను 'చెల్లి'గా పరిచయం.. మ్యాట్రీమోనీతో మహిళకు రూ.1.75 కోట్ల మోసం..!

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని నమ్మి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.1.75 కోట్లు మోసపోయింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు విజయ్ రాజ్ గౌడ తాను భారీ బిజినెస్‌మ్యాన్ అని , తన ఆస్తులు సుమారు రూ.715 కోట్లు అని అబద్ధాలు చెప్పాడు. మార్చి 2024లో ఆమెతో పరిచయం ఏర్పడింది. మొత్తం కుటుంబమే మోసంలో భాగమైంది. తండ్రి బొరేగౌడ, తాను రిటైర్డ్ తహసీల్దార్ అని నటించాడు. సౌమ్య నిజానికి భార్యే అయినా, “చెల్లెలు”గా పరిచయం చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు చూపించాడు, నాటకీయ సమావేశాలు అంటూ నాటకమాడారు. పెళ్లి నమ్మకం కోసం నాటకం మొదలు పెట్టాడు. కెంగేరి సమీపంలో కుటుంబ సమావేశాలు ఏర్పాటు చేశారు. మీ డబ్బుకు నేను గ్యారంటీ అని తండ్రి హామీ నమ్మించాడు. నమ్మకం పూర్తిగా పెంచారు, అసలు ప్లాన్ మొదలైంది ఇక్కడే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఖాతాలు ఫ్రీజ్ చేశాయంటూ నకిలీ కోర్టు పత్రాలు చూపించాడు. మొదట రూ.15,000 అడిగి నమ్మకం మరింత పెంచాడు.లోన్లు, పెట్టుబడులు అంటూ మోసం. జాయింట్ బిజినెస్ పేరుతో ఆమె పేరుపై అనేక బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు, ఆమె స్నేహితులు, బంధువుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. మొత్తం రూ.1.75 కోట్లు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. డబ్బు తిరిగి అడిగితే హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల పేరుతో ఆలస్యం అంటూ నాటకమాడారు. కేవలం రూ.22 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బు అడిగితే ప్రాణహానీ బెదిరింపులు చేశారు. అనుమానం వచ్చి ఆమె నిఘా పెడితే “చెల్లెలు”గా చెప్పిన మహిళే అతని భార్య అని తెలుసుకుంది. అతనికి ఇప్పటికే ఒక పిల్లవాడు ఉన్నాడని గుర్తించింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనలు కెంగేరి పరిధిలో కావడంతో కేసు అక్కడికి బదిలీ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఒక హెచ్చరిక అని పోలీసులు చెప్తున్నారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్లలో సంబంధాల పట్ల చాలా జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.


