జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యతో కుటుంబ కలహాలు తాళలేక భర్త ఆమెను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గణపురం మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, తరచూ గొడవలు జరగుతున్నాయి. ఈ కారణంగా భార్య సంధ్య తన తల్లిగారి ఇంట్లో నివాసం ఉంటోంది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న ఓటు వేసేందు సీతరాంపురం గ్రామానికి సంధ్య వచ్చింది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో రామాచారి ఆమెను ఉరి వేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు కూడా ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు రామాచారి ఒక వీడియోను రికార్డ్ చేసి విడుదల చేయడంతో పాటు, వాట్సాప్ స్టేటస్‌గా కూడా పెట్టుకున్నాడు. ఆ వీడియోలో తన భార్యతో ఎదురవుతున్న ఇబ్బందులు, మానసిక వేదన గురించి వివరించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


