వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డి(28), అదే గ్రామానికి చెందిన స్వాతి(21)తో 2024 జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డి(28), అదే గ్రామానికి చెందిన స్వాతి(21)తో 2024 జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులిద్దరూ హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చి బోడుప్పల్‌లో నివాసముంటున్నారు. వారు ప్రేమలో పడి, కుటుంబాల అంగీకారం లేకుండా 2024 జనవరి నెలలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి (కూకట్‌పల్లి మండలం, మల్కజిరి లేదా సమీప ప్రాంతంలోని ఆర్య సమాజ్ మండపంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి, బోడుప్పల్‌లోని ఒక చిన్న ఇంట్లో నివసించారు. మహేందర్ పని చేస్తూ, స్వాతి ఇంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు.

పెళ్లి అయిన కొన్ని వారాల్లోనే మహేందర్ రెడ్డి భార్యను మానసికంగా మరియు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. స్వాతి బయటి వ్యక్తులతో మాట్లాడుతుందని, అఫైర్ ఉందని భావించాడు డబ్బు సమస్యలు, కుటుంబ ఒత్తిడితో ఆమెను వేధించ సాగాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి కుటుంబసభ్యులకు తెలిపింది. కానీ కుటుంబం పెళ్లి తర్వాత సమస్యలు సాధారణమని అనుకుని, పెద్దగా ఫిర్యాదు చేయలేదు. స్వాతి గర్భవతి అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. 5నెలల గర్భవతి అయిన స్వాతి ఈనెల 27న వికారాబాద్‌ వెళ్లి ఆస్పత్రిలో చూపించుకున్నాక, తన పుట్టింటికి వెళ్తానంటూ ఈ నెల 22న భర్త మహేందర్‌రెడ్డికి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాతే స్వాతిని హతమార్చాలని మహేందర్‌రెడ్డి ప్లాన్‌ చేసుకున్నాడు. మరుసటి రోజైన శనివారం బోడుప్పల్‌లో హెక్సా బ్లేడ్‌లు కొని ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు భార్యను ఎలాగైనా హతమార్చాలని అవకాశం కోసం చూశాడు. సాయంత్రం సమయంలో మళ్లీ భా ర్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్య గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్‌పై ఉంచి హెక్సా బ్లేడుతో తల, చేతులు, కాళ్ల భాగాలను వేరు చేశాడు. చీకటి పడ్డాక తల, చేతులు, కాళ్ల భాగాలను ఓ సంచిలో తీసుకెళ్లి ప్రతాపసింగారం వద్ద మూసీలో పడేసి వచ్చాడు. మొండెం మాత్రం ఇంటిలోనే ఉంచాడు. 5 నెలల గర్భవతి కావడంతో మొండెం కవర్‌లో తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించి వదిలేశాడు. తన సోదరికి ఫోన్‌ చేసి స్వాతి కన్పించడం లేదంటూ చెప్పాడు. ఈలోగా శనివారం రాత్రి మహేందర్‌రెడ్డి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తన భార్య కనిపించడం లేదని చెప్పాడు. బోడుప్పల్‌ తమ పరిధికి రాదని మే డిపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా, అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు మహేందర్‌ ఫిర్యాదుపై అనుమానం వచ్చింది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి, ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా పోలీసులకు షాక్‌ తగిలింది. ఇంట్లో స్వాతి మొండెం లభించింది. మిగతా భాగాల గురించి పోలీసులు నిలదీయడంతో మూసీలో పడేశానని చెప్పాడు. ఆదివారం ఉదయం నుంచి మూసీలో పోలీసులు శరీర భాగాల కోసం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వెతికారు. మూసీ వరద ఉధృతి కారణంగా శరీరభాగాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు లంభించిన మొండేన్ని పో స్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపి, నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దరాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story