హైదరాబాద్ హాస్టల్ లో దారుణ హత్య

హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో దారుణ హత్య జరిగింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో వెంకటరమణ అనే వ్యక్తి ఉంటున్నాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. వెంకటరమణతో పాటు బార్బర్ గణేష్ కూడా హనుమ హాస్టల్లోని షేరింగ్ రూమ్ లో కలిసి ఉంటున్నాడు. అయితే గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

గణేష్ వెంకటరమణపై కోపం పెంచకున్నాడు. వెంకటరమణ పడుకుంటున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో గణేష్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. హాస్టల్ సిబ్బంది వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఈ హత్యకు సంబంధించి సమాచారం ఇచ్చారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు.


Updated On
Eha Tv

Eha Tv

Next Story