జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల్లో పెళ్లి జ‌రుగ‌నుండ‌గా.. అంతలోనే పెండ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల్లో పెళ్లి జ‌రుగ‌నుండ‌గా.. అంతలోనే పెండ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన బటికె సంపత్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేశారు. చిన్న కూతురైన కోమల (25) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంట్లో ఉంటుంది. మూడేళ్ల క్రితం కోమలకు పెళ్లి సంబంధం కుదుర్చుకుని వరపూజ కూడా చేశారు. కోమల తనకు పెళ్లి ఇష్టం లేదనడంతో తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.

ఇటీవల పోచారం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకొని.. ఈ నెల 28న ఘనంగా వివాహం చేయాలని తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్ర‌మంలోనే.. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోమల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న కూతురిని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలోను విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story