Wife Jumped with Boy freind: 2 నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రియుడితో జంప్..! తట్టుకోలేని భర్త ఏం చేశాడంటే..!

ఆ జంటకు రెండు నెలల క్రితమే పెళ్లి అయింది. ప్రేమించినప్పుడు మరొకరిని చేసుకోవడం ఎందుకు, పెళ్లి తర్వాత ప్రియుడితో వెళ్లిపోవడం ఎందుకు, అది తట్టుకోలేక భర్తలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ మహిళ చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. దావణగెరె జిల్లా గుమ్మనూరులో వివాహం జరిగిన రెండు నెలలకే నవ వధువు ప్రియునితో వెళ్లిపోవడంతో అవమానం భరించలేని భర్త సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు నిందితురాలు సరస్వతిని తాజాగా అరెస్టు చేశారు.

రెండు నెలల క్రితమే హరీష్‌కు సరస్వతిని ఇచ్చి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. యువతి మేనమామ రుద్రేశ్‌ (36) ఈ సంబంధాన్ని ఖాయం చేసి దగ్గరుండి వివాహం జరిపించారు. అయితే సరస్వతికి గతంలోనే ప్రేమ వ్యవహారం ఉండింది. ఈ మధ్య ఆమె గుడికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి ప్రియుడు శివకుమార్‌తో పారిపోయింది. అంతకుముందే ఆమె భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

ఇది తట్టుకోలేని హరీష్‌ గ్రామంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం భార్య, ఆమె ప్రియుడు, ఆమె బంధువులు గణేశ్‌, అంజినమ్మ తనను బెదిరించి వేధించారని హరీష్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ ఘోరాలను చూసిన రుద్రేశ్‌ ఆవేదన చెంది పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి ఆత్మహత్యలకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరస్వతిని దావణగెరెలోని ఎలెబేతూరులో బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. సరస్వతి చేసిన ఈ నిర్వాకం రెండు నిండు ప్రాణాలను తీసింది.

Updated On
ehatv

ehatv

Next Story