కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో నివసించే ఇస్లావత్ సంతోష్

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో నివసించే ఇస్లావత్ సంతోష్ ను, ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్న పర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25). ఈ జంటకు మూడేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉండగా, వివాహం సమయంలో రూ.3 లక్షలు కట్నం నాగరాణి తల్లిదండ్రులు ఇచ్చారు. కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం నాగరాణిని వేధిస్తూ, గురువారం ఆమెను భర్త సంతోష్, ఆమె తల్లి తీవ్రంగా అవమానించి వేధించారు. భర్త, అత్త వేరే గదికి వెళ్లిపోగానే, తను ఉన్న గదికి గడియ పెట్టుకుని ఇద్దరు పిల్లల ముందే ఉరివేసుకున్న ఉరేసుకుంది. పిల్లలు ఏడుపు విని పక్కింటి వాళ్లు వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉన్న నాగరాణిని గమనించి, తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని స్థానికులు కిందకు దించారు. ఏం జరిగిందో తెలియక తల్లి మృతదేహం వద్ద కూర్చున్న ఏడాది వయసున్న చిన్నారిని చూసి బంధువులు కూడా వలవలా ఏడ్చారు. నాగరాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
