హైదరాబాద్‌లో ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. కదులుతున్న బీఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 45లో చోటుచేసుకుంది. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో BMW కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం తరువాత, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా ఫైర్ ఇంజన్స్ రావడం ఆలస్యమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

అదృష్టవశాత్తూ, కారులో ఉన్నవారు మంటలను గమనించి వాహనంలో నుండి బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.


Updated On
Eha Tv

Eha Tv

Next Story