అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో దారుణ హత్య జరిగింది. వివరాళ్లోకెళితే.. అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో భర్తను భార్య హత్య చేసింది. ఇందుకు ఆమె అత్తమామలు కూడా సహకరించారు.

Murder in P. Gannavaram of Ambedkar Konaseema district
అంబేద్కర్ కోనసీమ(Ambedkar Konaseema District) జిల్లా పి.గన్నవరం(P. Gannavaram)లో దారుణ హత్య జరిగింది. వివరాళ్లోకెళితే.. అయినవిల్లి(Ainavilli) మండలం అయినవిల్లి లంక(Ainavilli Lanka)లో భర్తను భార్య హత్య చేసింది. ఇందుకు ఆమె అత్తమామలు కూడా సహకరించారు. భర్త ఇసుకపట్ల రామకృష్ణ(Ramakrishna) (34)ను భార్య సత్యనారాయణమ్మ(Satyanarayanamma) చెంబుతో కొట్టడంతో అతడు ప్రాణాలు ఒదిలాడు. రోజూ తాగొచ్చి భార్యను, తల్లిదండ్రులను కొట్టడంతో విసుగుచెంది.. చెంబుతో తలపై బలంగా కొట్టడంతో రామకృష్ణ చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుని తల్లిదండ్రులు కోడలికి సహకరించినట్లుగా చెబుతున్నారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితురాలు సత్యనారాయణమ్మ, మృతుని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
