బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. అత్తమామల ఇంటికి వెళ్లిన తర్వాత వేధింపులు మొదలయ్యాయి. వరకట్నం డిమాండ్ చేశారు. వారి డిమాండ్లు తీర్చ‌కపోవడంతో ఆ మహిళను సవతి పిల్లలు దారుణంగా కొట్టారు.

జమ్మూ కాశ్మీర్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెండో భార్యపై అతని ఇంట్లోనే అత్యాచారం జరిగింది. కట్నం డిమాండ్‌ను తీర్చకపోవడంతో.. ఆమెను బందీగా ఉంచి కొట్టారు. అసభ్యకరమైన వీడియో కూడా తీశాడు. ఈ మేర‌కు తీవ్రమైన‌ ఆరోపణలు చేస్తూ బాధితురాలు.. లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం జమ్మూ కాశ్మీర్‌లోని బందిపొర అని విచార‌ణ‌లో తేలడంతో.. దర్యాప్తు నిమిత్తం కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసులకు బదిలీ చేశారు.

లక్నో నివాసి అయిన బాధితురాలు జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరాలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నవంబర్ 2020లో వివాహం చేసుకుంది. ఆ అధికారికి ఇది రెండో పెళ్లి. అతనికి, మొదటి భార్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. అత్తమామల ఇంటికి వెళ్లిన తర్వాత వేధింపులు మొదలయ్యాయి. వరకట్నం డిమాండ్ చేశారు. వారి డిమాండ్లు తీర్చ‌కపోవడంతో ఆ మహిళను సవతి పిల్లలు దారుణంగా కొట్టారు.

బాధితురాలు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఏప్రిల్ 2024లో అధికారి మొద‌టి భార్య‌ అల్లుడు, ఆమె కొడుకు త‌నను ఐదు రోజుల పాటు బందీగా ఉంచి అత్యాచారం చేశారు. వారి చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకించ‌డంతో మళ్లీ కొట్టారు.. చంపేస్తామ‌ని బెదిరించారు. ఆ సమయంలో త‌న‌కు ఆహారం కూడా ఇవ్వలేదని తెలిపింది.

బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి తన తల్లి ఇంటికి పంపించారు. అంత‌కుముందు త‌న‌ భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళ కొన్ని వీడియోలు తీశార‌ని.. సాదా స్టాంపు పేపర్‌పై సంతకాలు కూడా చేయించుకున్నార‌ని ఫిర్యాదులో పేర్కొంది.

తొలుత ఘాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ మహిళ చెప్పింది. దీంతో జూన్ 21న లక్నో కమిషనర్‌కు ఫిర్యాదు చేశామ‌ని.. ఆమె సవతి కొడుకు, అల్లుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ వెల్ల‌డించింది.

Eha Tv

Eha Tv

Next Story