రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఓ కారు టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది.

Road accident on PV Narasimha Rao fly over
రంగారెడ్డి(Rangareddy) జిల్లా రాజేంద్రనగర్(Rajendra Nagar) పీవీ నరసింహారావు ప్లై ఓవర్(PV Narasimha Rao fly over)పై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Raod Accident) జరిగింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఓ కారు(Car) టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. కారు ప్లై ఓవర్‌పై వెళుతుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో టైర్ బ్లాస్ట్(Tyre Blast) కావడంతో డివైడర్ పై నుంచి ఎగిరి ఎదురుగావస్తున్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్(Traffic)ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
