Seven Years: The biological mother killed her seven-year-old child!

హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఏడేళ్ల చిన్నారిని బిల్డింగ్‌పై నుంచి తోసి కన్న తల్లే హతమార్చింది. వివరాల్లోకి వెళ్లే... మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో, తన ఏడేళ్ల కూతురు షారోన్ మేరీని మూడవ అంతస్తు పైనుండి పడేసిన తల్లి మోనాలిసా. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే ప్రాణాలు చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

లోకంలో తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు ఎదురైనా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఇటీవల కాలంలో తల్లులే బిడ్డల పాలిట యమకింకరులుగా మారిపోతున్నారు. అందుకు ఉదాహరణ తాజాగా మేడ్చల్‌ మల్కాజ్‌‌గిరి ప్రాంతంలో జరిగిన ఘటన. వసంతపురి కాలనీలో ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత కర్కశంగా హత్య చేసింది.

Updated On
ehatv

ehatv

Next Story