ఆరోగ్యశాఖ మంత్రి సహా పలువురు అధికారులకు లీగల్ నోటీసులు పంపిన మహిళా ఉద్యోగి.

ఆరోగ్యశాఖ మంత్రి సహా పలువురు అధికారులకు లీగల్ నోటీసులు పంపిన మహిళా ఉద్యోగి. హైదరాబాద్– కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో డిప్యూటేషన్ ఇప్పిస్తానని 2 లక్షలు లంచం డిమాండ్ చేసి, లక్ష రూపాయలు తీసుకొని, ఆర్డర్ ఇవ్వకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు సదరు మహిళా ఉద్యోగి పంపించిన విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటేషన్ కావాలంటే తన కోరిక తీర్చాలని వాట్సాప్ మెసేజీలు చేయడం, ఆఫీసుకు వెళితే తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఉద్యోగిని నోటీసులో పేర్కొంది.

గత ఏడాది జూలైలో రూ.50 వేలు గూగుల్ పే ద్వారా చెల్లించానని, డబ్బులు తీసుకుని వేదింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగిని ఆరోపణలు చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లాంటి పలువురు అధికారులకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఉద్యోగిని తరపు న్యాయవాది. వేదింపులకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెటనే అతన్ని విధుల నుండి సస్పెండ్ చేయాలని బాధిత ఉద్యోగురాలు డిమాండ్ చేస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story