She invited her boyfriend for New Year's celebrations.. and when he took off his pants, she cut off his penis..! What actually happened..!

న్యూఇయర్‌ వేడుకల కోసం ప్రియుడిని పిలిచింది.. ప్యాంట్‌ విప్పగానే పెన్నిస్‌ను కోసేసింది..! అసలు ఏం జరిగిందంటే..!. డిసెంబర్ 31 రాత్రి, అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 25 ఏళ్ల వివాహిత, తన 44 ఏళ్ల వివాహిత ప్రేమికుడిని నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని పిలిచింది. అతను ఇంటికి రాగానే, ఆ మహిళ అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.

ప్రియుడు ప్రస్తుతం ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రియురాలు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ప్రియుడు, ప్రియురాలు బంధువులే. నిందితురాలు, ప్రియుడి సోదిరికి వదిన. వారిద్దరికీ గత ఆరేడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ప్రియుడిపై ప్రియురాలు ఒత్తిడి తీసుకొస్తోంది. భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తోందని, దీనివల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని తేలింది. ప్రియురాలి ఒత్తిడి భరించలేక గత 18 సంవత్సరాలుగా శాంటా క్రూజ్ తూర్పులో తన కుటుంబంతో నివసిస్తున్న బాధితుడు, 2025 నవంబర్‌లో బీహార్‌కు వెళ్లాడని నివేదిక పేర్కొంది.

అయితే, బీహార్‌కు వెళ్లినా ఆ మహిళ ఫోన్ కాల్స్ ద్వారా అతన్ని బెదిరిస్తూనే ఉంది. అతను డిసెంబర్ 19న ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె ఫోన్స్‌కు స్పందించడం మానేశారు. డిసెంబర్ 31న, తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో, ఆ మహిళ అతనికి కొత్త ఏడాది స్వీట్లు ఇస్తానని చెప్పి అతన్ని పిలిపించుకుంది. ఆ తర్వాత ప్రియుడిని ప్యాంటు విప్పాలని కోరింది. ప్రియుడు ప్యాంట్‌ విప్పగా కత్తిని తీసుకుని అకస్మాత్తుగా అతని ప్రైవేట్ భాగాలపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో బాధితుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కుమారులు, స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రియురాలి కోసం గాలిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story