ఐదు రోజులుగా పోలీసులను తిప్పలు పెడుతున్న కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఐదు రోజులుగా పోలీసులను తిప్పలు పెడుతున్న కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్‌లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్‌ నిర్వహిస్తున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్‌ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్‌ కూడా తినిపించి శుభాకాంక్షలు చెప్పాడు. మైనర్‌ వయసులో ఉన్న టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. సైకోలా మారి బాలికను హతమార్చాడు. యూట్యూబ్‌లో వీడియోలు, క్రైం సీన్సు చూసి ఈ పథకానికి స్కెచ్‌ వేశాడు.పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్‌గా బాలుడు వ్యవహరించాడు.బాలుడి తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును గాలికి వదిలేయడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్‌ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్‌ చూసి దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్‌ మీద ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ బాలుడు రాసుకున్నాడు. హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్‌ లీక్‌ చేయాలనుకున్నాడని పోలీసులు తెలిపారు.

ehatv

ehatv

Next Story