జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో భర్తకు పక్షవాతం రావడంతో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో భర్తకు పక్షవాతం రావడంతో, అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ. వివాహేతర సంబంధం గురించి అనుమానం వచ్చి తల్లిని నిలదీసిన కూతురు వర్షిణి. దీంతో ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలిసి కూతురు గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని సంచిలో కట్టి గ్రామ శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక గుట్ట పొదల్లో పారేసిన కవిత. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఆ తర్వాత శవాన్ని ఎవరైనా చూస్తే అనుమానం వస్తుందేమో అని, ఆగస్టు 25వ తేదీన బైకుపై తీసుకెళ్లి, కాటారం సమీపంలోని అడవిలో పడేసి, ఆదార్ కార్డు పెట్టి చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు చిత్రీకరించిన కిల్లర్ లేడీ. అంతకు ముందే జూన్ 25న ఇంట్లో కూతురు లేని సమయంలో, ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులను నమ్మించిన కవిత. విచారణలో దొరికిపోగా, ప్రియుడు రాజ్ కుమార్, కవితను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
