రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు

రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మారుతీ సుజుకీ ఈకో కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆరుగురు మరణించారని బుండి అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఉమా శర్మ తెలిపారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ జాతీయ రహదారి వద్ద ఈ సంఘటన జరిగింది.

పోలీసుల ప్రకారం.. గాయపడిన ముగ్గురు ఎంపీపీ వాసులు. ఈకో కారును ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు. హైవేపై అమర్చిన సీసీ కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల రికార్డింగ్‌ల ఆధారంగా గుర్తుతెలియని వాహనం కోసం జ‌ల్లెడ ప‌డుతున్న‌ట్లు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి ఉదయం 4.30 గంటలకు సమాచారం అందిందని పోలీసు అధికారి చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తొలుత ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story