చాలా ఈజీగా మనీ సంపాదనకు అలవాటు పడిన భర్త, భార్య, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మాయమాటలతోచ, మత్తెక్కించే మాటలతో యువకులను ఆకర్షించి

చాలా ఈజీగా మనీ సంపాదనకు అలవాటు పడిన భర్త, భార్య, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మాయమాటలతోచ, మత్తెక్కించే మాటలతో యువకులను ఆకర్షించి, ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి బలరాం నగర్‌కు చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, మల్లేష్ ప్రేమికురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముగ్గురూ కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. వ్యాపారవేత్తలు, డబ్బున్న వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. వారికి ఫోన్ చేసి కమ్మని మాటల చెప్పి ముగ్గులోకి దింపుతారు. ఆ తర్వాత నగ్న వీడియోలు పంపి బెదిరించి డబ్బులు దండుకునేవారు. కర్నూలుకు చెందిన వ్యాపారి ప్రదీప్ ఈ ముఠా సభ్యుల ఉచ్చులో పడి దాదాపు రూ.3.80 కోట్ల నగదు వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికత సాయంతో వారు వినియోగించిన కాల్ డేటా ఆధారంగా రెండో పట్టణ పోలీసులు ముఠా సభ్యుల గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపారు.
ముగ్గురు ముఠా సభ్యులు కలసి సంయుక్త రెడ్డి పేరుతో ట్విటర్ ఖాతా తెరిచారు. ఈ ఖాతా ద్వారా నగ్నంగా వీడియో కాల్స్ చేసి మత్తెక్కించే మాటలతో నమ్మించి మోసానికి పాల్పడ్డారు. విజయవాడకు సమీపంలో తమకు ఖరీదైన పొలం ఉందని, డబ్బులు అవసరమున్నందున తక్కువ ధరకే ఇస్తామంటూ రూ.3.80 కోట్లు వసూలు చేశారు. రూ.41.26 లక్షలకు రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బు రూ.3.38 కోట్ల నగదును ముగ్గురూ పంచుకుని ఎంజాయ్ చేశారు. తాను ఈ ముఠా చేతిలో మోసపోయానని గ్రహించిన ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రదీప్ ఫిర్యాదు ఆధారంగా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి విచారించగా వీరి వ్యవహారం బయటపడింది. ముఠా నుంచి రెండు కార్లు, మోటార్ సైకిల్, ల్యాప్‌టాప్, 5 తులాల బంగారం, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
