Telugu woman brutally murdered by ex-boyfriend in America..!

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి గురించి గాలింపు చేపట్టగా తన మాజీ ప్రియుడు ఫ్లాట్‌లో శవమై కనిపించింది. మేరీల్యాండ్‌లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం అమెరికా పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే హత్య చేసి ఇండియాకి పారిపోయి వచ్చిన బాధితురాలి పాత స్నేహితుడు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న కొలంబియాలో నివాసముంటున్న నికిత గోడిశాల(27) అనే యువతి కనిపించడంలేదని, చివరిగా తనను డిసెంబర్ 31వ తేదీన ఎల్లికాట్ సిటీలో చూశానని పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ శర్మ(26) అనే యువకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఇండియా పారిపోయి వచ్చిన అర్జున్
దీంతో అతడి మీద అనుమానం వచ్చి సెర్చ్ వారెంట్ తీసుకుని, అతని అపార్టుమెంటులో తనిఖీలు చేయగా, విగత జీవిగా పడి ఉన్న నికితను కనుగొన్న పోలీసులు. నికిత మృతదేహంపై కత్తి పోటు గాయాలు ఉండడంతో, అర్జున్ శర్మనే హత్య చేసి ఇండియా పారిపోయాడని పోలీసుల అనుమానం. అర్జున్ ఇండియా పారిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయం కోరిన స్థానిక పోలీసులు. మాజీ ప్రియుడిపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తుంది.


