థాయిలాండ్‌కు చెందిన యువతి(30) ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన స్నేహితుడి కోసం చెన్నై(Chennai)కి వచ్చింది.

థాయిలాండ్‌కు చెందిన యువతి(30) ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన స్నేహితుడి కోసం చెన్నై(Chennai)కి వచ్చింది. అతడు ఓ హోటల్‌లో ఉంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి మోసం చేసి వెళ్లిపోవడంతో హోటల్ రెంట్ కట్టడం కోసం వ్యభిచారంలోకి దిగింది. యువతి తిరిగి ఇంటికి వెళ్ళడానికి టికెట్ డబ్బులు లేకపోవడంతో, థాయిలాండ్ నుండి వ్యభిచారం కోసం అమ్మాయిలను పంపే వారిని సంప్రదించింది. వారు ఆ యువతితో మరో యువతిని కలిపి హైదరాబాద్(Hyderabad) శ్రీనగర్‌లోని ఓ ప్లాట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడు మోసం చేయడం వల్ల టికెట్ ఛార్జీలకు డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితిలో వ్యభిచార వృత్తిలోకి దిగానని యువతి తెలుపగా, పోలీసులు ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు

ehatv

ehatv

Next Story