Husband vs Wife: భార్యకు ప్రియుడు ఉన్నాడని తెలిసి వదిలేసిన భర్త.. వాడుకొని వదిలేసిన ప్రియుడు..!

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకు చెందిన అక్షిత, సురేష్‌ల ప్రేమకథ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అక్షిత సురేష్, బెల్కటూరు గ్రామానికి చెందిన వారు, ప్రేమించుకున్నారు. అయితే, వారి కుటుంబాలు ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు. అక్షిత కుటుంబం ఆమెను కర్ణాటకకు చెందిన మరొక యువకుడితో వివాహం చేసింది. అయినప్పటికీ, సురేష్ అక్షితను వదల్లేదు, ఆమెకు నిత్యం ఫోన్ చేసి వేధించాడు. ఈ విషయం అక్షిత భర్తకు తెలిసింది, దీంతో అతను ఆమె పెళ్లికి ముందు ప్రేమకథ గురించి తెలుసుకొని షాకయ్యాడు. ప్రియుడితో కలిసి తనను తన భార్య ఎక్కడ చంపేస్తుందేమోనని భయపడిపోయాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో అక్షితతో తెగదెంపులు చేసుకున్నాడు. భర్త విడిచిపెట్టడంతో తిరిగి బెల్కటూర్‌కు వచ్చిన అక్షితతో సురేశ్‌ తన ప్రేమాయణాన్ని కంటిన్యూ చేశారు. నీకు నేనున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. శారీరకంగా వాడుకుని మొహం చాటేశాడు. సురేశ్‌ను పెళ్లి గురించి అడగడంతో అతను దూరం పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన అక్షిత పోలీసులను ఆశ్రయించింది. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story