ఫోన్ ఇవ్వలేదని.. తల్లిపై కొడుకు కత్తితో దాడి

ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఫోన్లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ ఇవ్వమని అడిగాడు. తల్లి ఫోన్ ఇవ్వలేదు. దీంతో తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కోపంలో తల్లి పై కత్తితో గొంతుపై దాడి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు మనము ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నమని.. బయటికి వెళ్లి ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చుని ఫోను నొక్కుకుంటా ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేమ్స్ ఆడుతే వారి మానసిక పరిస్థితి చాలా దెబ్బతింటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో మనల్ని ఏది అడిగినా ఇవ్వకపోవడంతో.. చాలా కోపంగా తీసుకుంటారన్నారు. అందుకే పిల్లలకు ఫోన్ నుండి చాలా దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు

Updated On
ehatv

ehatv

Next Story