Lady Killed by Lover: ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం.. నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం.. ఇద్దరూ లాడ్జిలో ఎంజాయ్ చేస్తూ..!

ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం.. నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం.. ఇద్దరూ లాడ్జిలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమై, అది ప్రాణాలకు మీదకు తెచ్చింది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఏర్కాడ్‌లోని ఓ ప్రైవేట్ కాటేజీలో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను గొంతు నులిమి ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలిని ధర్మపురి జిల్లాకు చెందిన 30 ఏళ్ల శాలగా గుర్తించారు. నిందితుడు సేలంకు చెందిన పార్థిబన్. శాల-పార్థిబన్ మధ్య ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఈ క్రమంలో తన మరోసారి ప్రైవేట్‌గా కలుద్దామని చెప్పి పార్థిబన్, శాలను బైక్‌పై ఏర్కాడ్ తీసుకెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేట్ కాటేజీలో గది తీసుకున్నారు. ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. తనను పెళ్లి చేసుకోవాలని పార్థిబన్‌ను శాల కోరింది. అందుకు అతను నిరాకరించడంతో, కనీసం పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి 'సెటిల్మెంట్' చేయాలని ఆమె ఒత్తిడి తెచ్చింది. నాతో పడక సుఖం ఒకటే కావాలి కానీ మాత్రం డబ్బులు ఇవ్వవా అంటూ ఒత్తిడి చేసింది. ఊరికి వెళ్ళాక ఇస్తానని పార్థిబన్ చెప్పినా వినకుండా, డబ్బు ఇస్తేనే మళ్ళీ కలుస్తానని ఆమె తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన పార్థిబన్, ఆమె చీరతోనే గొంతు బిగించి హత్య చేశాడు. శాల హత్య తర్వాత పార్థిబన్ గదికి బయట నుండి తాళం వేసి పారిపోయాడు. ఊరికి చేరుకున్న పార్థిబన్ తన స్నేహితుడికి ఈ విషయం చెప్పగా, స్నేహితుడే పోలీసులకు సమాచారం అందించాడు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.


