వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. కానీ ఆ కాపురంలో తీవ్ర విషాదం నెలకొంది.

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. కానీ ఆ కాపురంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇన్‌స్ట్రాగామ్‌లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాంగోపాల్‌పేట్‌ గైదీన్‌బాగ్‌కు చెందిన కీర్తి, రామంతపూర్‌కు చెందిన భీమ్‌రాజ్‌ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. అయితే ఈ మధ్యకాలంలో అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మళ్లీ భర్త ఇంటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అయితే ఆ గర్భం తన వల్లే వచ్చిందన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన కీర్తి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ehatv

ehatv

Next Story