ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ జిల్లాలో గ్రామపెద్ద ఓ వ్యక్తికి శిక్ష విధిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాళ్లో కెళితే.. దివయాచి గ్రామంలో గ్రామపెద్ద ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి, ఆపై చెట్టు కింద నిప్పంటించి తీవ్రంగా హింసించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుడు గ్రామపెద్దను జైలుకు పంపారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో గ్రామపెద్ద ఆ యువకుడికి ఈ శిక్ష విధించినట్లు సమాచారం. దివయాచి గ్రామానికి చెందిన […]

ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ జిల్లాలో గ్రామపెద్ద ఓ వ్యక్తికి శిక్ష విధిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాళ్లో కెళితే.. దివయాచి గ్రామంలో గ్రామపెద్ద ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి, ఆపై చెట్టు కింద నిప్పంటించి తీవ్రంగా హింసించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ జిల్లాలో గ్రామపెద్ద ఓ వ్యక్తికి శిక్ష విధిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాళ్లో కెళితే.. దివయాచి గ్రామంలో గ్రామపెద్ద ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి, ఆపై చెట్టు కింద నిప్పంటించి తీవ్రంగా హింసించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుడు గ్రామపెద్దను జైలుకు పంపారు. దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో గ్రామపెద్ద ఆ యువకుడికి ఈ శిక్ష విధించినట్లు సమాచారం.
దివయాచి గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ కుమారుడు భూపాల్ సింగ్‌ను మార్చి 28న గ్రామపెద్ద విష్ణుదయాళ్ అతని కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకున్నట్లు చెబుతున్నారు. గ్రామపెద్ద తనను ఊరి బయటికి ఈడ్చుకెళ్లి మర్రి చెట్టుకు వేలాడదీసినట్లు బాధితుడు ఆరోపించాడు. అలాగే సజీవ దహనం చేయాలనే ఉద్దేశంతో నిప్పంటించాడు. ఇదంతా గ్రామ ప్రజలు నిల్చొని వీడియోలు తీస్తున్నారు. సుమారు అరగంట పాటు కింద మంటలు చెలరేగాయని.. నేను స్పృహతప్పి పడిపోయానని.. చనిపోయానని భావించి గ్రామపెద్ద అక్కడి నుంచి పారిపోయాడని బాధితుడు చెప్పాడు.
గ్రామానికి చెందిన కొందరు యువకుడి బావమరిదికి విషయాన్ని తెలియజేశారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చెట్టుపై నుంచి కిందకు దించాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు.
