పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రులకు వాట్సప్ వైద్యం గర్భశోకాన్ని మిగిల్చింది.

పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రులకు వాట్సప్ వైద్యం గర్భశోకాన్ని మిగిల్చింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వైద్యం వికటించింది. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్(Butti Ganesh), కీర్తిల(Keerthi)కు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి (Anusha Reddy)దగ్గర దంపతులు వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో.. డాక్టర్ వాట్సప్ వీడియో కాల్(WhatsApp video call) ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణి కీర్తికి ఇంజక్షన్లు ఇచ్చి నర్సు చికిత్స చేసింది. దీంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు. అనంతరం చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం. మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారు.. పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ ఆసుపత్రి వద్ద బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంతానం కోసం రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని.. కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. దీంతో ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకుని ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు సీజ్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story