నిన్నటి వరకు ఒక ట్రెండ్.. ఇప్పుడు మరో ట్రెండ్ ముఖ్యంగా అమ్మాయిలు తెగించేస్తున్నారు. కట్టుకున్నోడిని కాటికి పంపే వరకు ఆగడం లేదు.

నిన్నటి వరకు ఒక ట్రెండ్.. ఇప్పుడు మరో ట్రెండ్ ముఖ్యంగా అమ్మాయిలు తెగించేస్తున్నారు. కట్టుకున్నోడిని కాటికి పంపే వరకు ఆగడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే ప్లాన్ అమలు చేసింది ఓ హంతకి. పెళ్లిఅంటేనే అబ్బాయిలు భయపడే పరిస్థితి వచ్చింది. పెళ్లి రూపంలో తమతో పాటు వచ్చేది వధువు కాదు, కాలనాగని తెలిసేసరికే కాటేస్తున్నారు. అంతేకాదు దాన్ని కప్పిపుచ్చి ప్రియుడుతో జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అమాయకపు భర్తలు కాస్త మృత్యువాడికి చేరుతున్నారు. యాదాద్రి భువనగరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో దారుణం జరిగింది. సినీ ఫకీలో భర్తను హత్య చేసింది ఓ హంతకి. సుపారి కిల్లర్స్ ను రంగంలోకి దించి, మరీ భర్తను లేపేసినట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి కాటేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని స్వామిగా నిర్ధారించారు. స్వామి బైక్‌పై వెళ్తుండగా కారు డీకొట్టి చనిపోయాడు అనుకున్నారు. దీని ఓ ప్రమాదంగా భావించారు పోలీసులు. అయితే ప్రమాద స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి అనుమానించిన పోలీసులు ఈ ఘటనను హత్య కేసుగా మార్చారు. స్వామి మృతిపై విచారణ చేపట్టగా భార్యే నిందితురాలని తేలింది తమదైన స్టైల్లో విచారిస్తే, తాను మొగుడిని హత్య చేసినట్లు అంగీకరించింది నిందితురాలు. స్వామి బైక్ పై వెళ్తుంటే కారుతో డీకొట్టి చంపేసినట్లు వెల్లడించింది. కారును రెంటుకు తీసుకొని మరి ఈ ఘాతకానికి ఉడిగట్టింది భార్య. ఈ హత్య కేసులో స్వామి భార్యతో పాటు బామ్మర్ది, సుపారి కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
