ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ సమయంలో భార్య గర్భంతో ఉండడం అపశకునమని భావించి, భర్త తన భార్యకు అబార్షన్ మాత్రలు మింగించాడు. ప్రవళిక(pravalika), ప్రశాంత్‌ల(Prashanth)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల వారు నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సమయంలో ప్రవళిక గర్భవతి అని తెలియడంతో, ప్రశాంత్ ఇంటి నిర్మాణ సమయంలో గర్భం ఉండడం అపశకునమని భావించాడు. ఈ మూఢనమ్మకం కారణంగా, ఆమెకు తెలియకుండా అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. దీంతో ప్రవళిక ఆసుపత్రిలో చేరగా, ఆమె గర్భస్రావం జరిగినట్లు వైద్యులు ధృవీకరించారు. గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని రిమ్స్(Rims)లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్(Adilabad) రూరల్ సీఐ ఫణీందర్ తెలిపారు.
