హైదరాబాద్‌లో సంచలనం.ప్రేమ అనే మేడలో పతనం ఘోరంగా మారింది.

హైదరాబాద్‌లో సంచలనం.ప్రేమ అనే మేడలో పతనం ఘోరంగా మారింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నేరానికి పాల్పడి, దానిని గుండెపోటుగా చూపిస్తూ పోలీసులు మోసగించే ప్రయత్నం చేసింది. కానీ పోస్టుమార్టం రిపోర్టు మొత్తం పథకాన్ని బట్టబయలు చేసింది.మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో నివసిస్తున్న అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులు 12 ఏళ్లుగా వివాహ జీవితం గడుపుతున్నారు. వీరికి 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అశోక్ ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తుండగా, పూర్ణిమ ఇంటివద్ద పిల్లలకు ట్యూషన్లు చెప్పేది.ఇటీవల అదే కాలనీలో నివసించే పాలేటి మహేష్ (22) అనే వ్యక్తితో పూర్ణిమకు పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే ఆ పరిచయం ప్రేమలోకి మారింది. ఈ వ్యవహారంపై అశోక్ అనుమానంతో పూర్ణిమను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ప్రేమలో మునిగి తేలిన పూర్ణిమకు తన భర్త అడ్డుగా అనిపించింది.దీంతో ప్రియుడు మహేష్, అతని స్నేహితుడు సాయితో కలిసి అశోక్‌ను హతమార్చే పథకం వేసింది. ఈ నెల 11వ తేదీ రాత్రి అశోక్ కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, పూర్ణిమ సహకారంతో మహేష్, సాయిలు కలిసి చున్నీతో అతని గొంతు నులిమి చంపారు. అనంతరం ఆయన గుండెపోటు వల్ల మృతి చెందినట్లు అబద్దపు కథ రాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తర్వాత అశోక్ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీస్ విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హతమార్చినట్లు తేలడంతో పూర్ణిమ, మహేష్, సాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా నిందితులు నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ప్రేమలో పడ్డ పూర్ణిమ చేసిన ఈ పన్నాగం చివరికి ఆమె జీవితాన్నే నాశనం చేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


