తమిళనాడు(Tamil Nadu) పుదుక్కొట్టాయ్(Pudukkottai)లో దారుణం జరిగింది. ప్రియుడిని చంపి ముక్కలు ముక్కలు చేసింది ప్రియురాలు. ఆ శరీర భాగాలను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి 29 ఏళ్ల జయంతన్(jayantan).. ఇతడిని హత్య చేసింది 38 ఏళ్ల భాగ్యలక్ష్మి(Bhagya Lakshmi). జయంతన్ చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport)లో గ్రౌండ్ స్టాఫ్(Ground Staff)గా పని చేస్తున్నాడు. భాగ్యలక్ష‍్మి ఓ సెక్స్ వర్కర్‌గా పనిచేసేది.

Tamil Nadu woman murder boyfriend
తమిళనాడు(Tamil Nadu) పుదుక్కొట్టాయ్(Pudukkottai)లో దారుణం జరిగింది. ప్రియుడిని చంపి ముక్కలు ముక్కలు చేసింది ప్రియురాలు. ఆ శరీర భాగాలను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి 29 ఏళ్ల జయంతన్(jayantan).. ఇతడిని హత్య చేసింది 38 ఏళ్ల భాగ్యలక్ష్మి(Bhagya Lakshmi). జయంతన్ చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport)లో గ్రౌండ్ స్టాఫ్(Ground Staff)గా పని చేస్తున్నాడు. భాగ్యలక్ష‍్మి ఓ సెక్స్ వర్కర్‌గా పనిచేసేది. 2020 మే నెలలో భాగ్యలక్ష్మిని ఓ లాడ్జిలో కలిశాడు జయంతన్. ఆ తర్వాత ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆమెను గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు. పుదుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష్మి జయంతన్‌ను మార్చి 19న ఇంటికి రావాలని పిలిచింది. అతడు వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జయంతన్‌పై కోపం పెంచుకుంది. తన ఫ్రెండ్ శంకర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు మరో ఇద్దరిని వెంటపెట్టుకుని వచ్చాడు. తర్వాత నలుగురూ కలిసి మరుసటి రోజు తెల్లవారుజామున జయంతన్‌ను చంపేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఆ ముక్కలను 400 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగివచ్చారు. ఇంట్లో ఇంకొన్ని శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్ బుక్ చేసుకుని చెన్నైకు వెళ్లింది భాగ్యలక్ష్మి. వాటిని కూడా కోవలంలో పాతి పెట్టి పుదుక్కొట్టాయ్‌కు తిరిగి వచ్చింది.
జయంతన్ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళతానని తన సోదరి జయకృభకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. వెంటనే ఆమె పోలీసుస్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేసింది. అతడి ఆచూకిని కనిపెట్టడానికి ప్రయత్నించిన పోలీసులకు హత్య విషయం తెలిసింది. భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
