హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్ బ్యాగ్‌లో ఓ మహిళ మృతదేహం కనుగొనబడింది

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్ బ్యాగ్‌లో ఓ మహిళ మృతదేహం కనుగొనబడింది, ఇది స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. రెడ్డీస్ ల్యాబ్ (Reddy Lab)ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఈ సూట్‌కేస్ కనిపించింది. దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, బాచుపల్లి(Bachupally) పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం డీకంపొజిషన్‌ స్థితిలో ఉండటంతో, ఆమె వివరాలు వెంటనే తెలియలేదు. పోలీసులు మృతదేహాన్ని ఓస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించి, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో, ఈ మహిళ హత్యకు గురై ఉండవచ్చని, ఆమె శరీరాన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఈ నిర్మానుష్య ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌(CCTV footage)లను పరిశీలిస్తూ, స్థానికంగా సమాచారం సేకరిస్తూ, మిస్సింగ్ కంప్లైంట్స్‌ను ఆధారంగా ఆమె గుర్తింపును కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనపై హత్య కింద కేసు నమోదు చేయబడింది.

Updated On
ehatv

ehatv

Next Story