ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాపూర్‌ జిల్లాలో ఓ సంఘటన కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాపూర్‌ జిల్లాలో ఓ సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఢిల్లీ(Delhi)-లక్నో(Lucknow) హైవే(high) పక్కన వదిలేసిన ఎర్రటి సూట్‌కేస్‌(Suitcase) కనిపించింది. దానిని తెరిచి చూసిన వారు వణికిపోయారు. అందులో కుక్కి ఉన్న మహిళ మృతదేహం(Women deadbody) కనిపించడంతో భయపడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని సూట్‌కేస్‌ నుంచి బయటకు తీశారు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. మహిళ వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూట్‌కేస్‌ ఎవరు వదిలేశారో అన్నది కనిపెట్టేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story