బతుకమ్మ సంబరాల్లో ఆనందంగా గడిపింది. ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకుంది.

బతుకమ్మ సంబరాల్లో ఆనందంగా గడిపింది. ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకుంది. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఓ మహిళ సంబరాలు ముగిశాక గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్, ఆదిబట్లలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పారెళ్లి లక్ష్మీ(66) ఆదిబట్లలోని టీసీఎస్ మహిళా ఉద్యోగుల కోసం రామకృష్ణ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి బతుకమ్మ వేడుకల్లో లక్ష్మీ పాల్గొన్నారు. అలసిపోయినట్లు అనిపించడంతో హాస్టల్‌లోనే నిద్రపోయారు. నిద్రలోనే లక్ష్మీ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా లక్ష్మీ గతంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW)సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు.

ehatv

ehatv

Next Story