హైదరాబాద్‌ నగరంలోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌ నగరంలోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ఓనర్‌కు ఉన్న బంగారంపై కన్నేశారు ఇంట్లో ఉండే కుర్రాళ్లు. ఇంటి ఓనర్‌ను దారుణంగా చంపేశారు ముగ్గురు యువకులు. ఆపై ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపడింది.

నాచారంలో నివాసం ఉంటున్న సుజాతను.. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులు కిరాకతంగా హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని బ్యాగులో కుక్కి రాజమండ్రి తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు. సుజాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఏం తెలియనట్లు సుజాత కుటుంబ సభ్యులతో కలిసి నిందితులు గాలించినట్లు నాటకమాడారు. ఇంట్లో ఉండే కుర్రాళ్లపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నిందితులు బంగారం కోసం తామే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story