వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా

వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా" అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
హైదరాబాద్–ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇంటికి వెళ్లిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హితవర్షిణి(20)
తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండడంతో హైదరాబాద్ వచ్చి, బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న హితవర్షిణి
యువతి చివరిగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు (28) అనే అబ్బాయితో ఫోన్ మాట్లాడింది అని తెలిసి, విచారించేందుకు వెళ్లగా అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న పోలీసులు
యువకుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, వీరిద్దరు ప్రేమించుకున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని నిర్ధారించిన పోలీసులు
వినయ్ బాబు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
