సిద్దిపేట జిల్లా, జగదేవ్‌పూర్ మండలం, చాట్లపల్లి(Chatlapalli) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

సిద్దిపేట జిల్లా, జగదేవ్‌పూర్ మండలం, చాట్లపల్లి(Chatlapalli) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జానీ (Jani)(21), కనకయ్య కుమారుడు. జానీ తన తండ్రి కనకయ్యను బీఎండబ్ల్యూ కారు(BMW car) కొనాలని చాలా రోజులుగా వేధిస్తున్నాడు. కనకయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, ఆర్థికంగా స్థోమత లేనందున బీఎండబ్ల్యూ కారు కొనలేనని చెప్పాడు. స్విఫ్ట్ కారు(Swift Car) కొనివ్వగలనని అన్నాడు. మారుతీ కారు తనకు వద్దని బీఎండబ్ల్యూ కారే కావాలని పట్టుబట్టి మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆర్‌వీఎం(RVM) ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story