ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు.

ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అయితే మహాభారత కాలంలో కత్తులు, కర్రలు, తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన 5 యుద్ధాల గురించి మీకు తెలుసా? నిజమైన బలం..హింస లేకుండానే వస్తుందని,జ్ణానం, ఓర్పు, సంకల్పంతో జరిగిన 5 మహాభారత యుద్ధాలు మనకు తెలియజేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
జ్ణాన యుద్ధం
మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు. విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు. విదురుడు..కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలెక్కువని నమ్మినవాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్యాతుర్యంతో, వివేకంతోనే యద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం. ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్సూచిలా నిలబడ్డాడు. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు ధుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించాడు. ధర్మాన్ని కాపాడటానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాశ, అహంకారంతో నిండిన శత్రువులపై శిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం. విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా నిలుస్తుంది.
సహన యుద్ధం
మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు,పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు. ధర్మరాజు తన సహనాన్ని,ధర్మానికి కట్టుబడి ఉండే గుణానని అత్యంత కఠినమైన పరీక్షకు నెలబెట్టాడు. మోసం జరుగుతున్నా,అవమానాలు పెనుభూతంలా వెంటాడినా,అడుగడునా నష్టం అతడిని కుంగదీసినా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు,బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు.
ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతి రూపం. క్షణికావేకాశాలకు లొంగకుండా, ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భతం. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను, తొందపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది.
నిశ్శబ్ద యుద్ధం
కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు ధుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం(నారాయణి సేన) మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగి,నిరాయుధిగా,ఎలాంటి కదలలలేని సాక్షిలా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ధుర్యోధనుడు సంఖ్యా బలం, కండ బలంపై గుడి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు.
నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం కేవలం ఎంపిక మాత్రమే కాదు..అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపులో కాదు నిస్వార్థ్యమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది. కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలిస్తుందని అర్జునుడి విశ్వాపం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది.
వినయ యుద్ధం
మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ణ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ణ కేవలం మాటలు కాదు..అది తనలోని కోరికలకు,ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిర నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని..కొన్నిసార్లు తమ అంతరంగంలోనూ యుద్ధం చేస్తారని భీష్ణుడి పాత్ర తెలియజేస్తుంది. తన న్యాయమైన కోరికలను, తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు..ఇది కురుసామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది.
ధర్మ యుద్ధం
పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు. దీంతో ఆమెను జట్టు పట్టుకొని సభకు ఈడ్చకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది. అయితే అప్పుడు ద్రౌపది ఎదురుతిరిగి పోరాడలేదు. సభలో ఉన్న పెద్దలను,రాజులను తన పదునైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది. తన మాటలనే ఆయుధాలుగా వాడింది.
ఆమె ప్రశ్నించిన తీరు,ఆమె చూపిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురక్ష్రేతంలో ధర్మం కోసం జరిగే మహా సంగ్రామానికి అగ్గి రాజేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురు వంశాన్నే దహించేసే మహాజ్వాలగా అయింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మపోరాటం చరిత్రలో నిలిచిపోయింది.
