ఈ గుడికి వెళ్తే చాలు..! ఇక మీ 'బొచ్చు' ఎవరూ పీకలేరు..!

మీ జుట్టు రాలిపోతుందా.. బట్ట తల వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయా. అయితే ఆ గుడిని సందర్శిస్తే చాలు. ఇక మీరు నిశ్చితంగా ఉండొచ్చు. మీ జుట్టు ఊడిపోదు, ఇంకా ఆరోగ్యకరమైన జుట్టు వస్తుంది. ఈ గుడి జపాన్‌లోని క్యోటో నగరం సమీపంలో ఉంది. దీని వెనుక ఉన్న కథ కూడా చాలా పెద్దదే. మికామి పుణ్యక్షేత్రం జపాన్‌లో మొట్టమొదటి హెయిర్‌డ్రెస్సర్‌గా ఉన్న ''ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి'' పేరుతో ఉంది. అతను తన కుటుంబాన్ని పోషించడానికి జుట్టు కత్తిరించడం, స్టైలింగ్ చేయడం ప్రారంభించాడని ఇక్కడి పురాణాలు చెప్తాయి. జుట్టు రాలుతున్నా, జుట్టు పెరగాలన్నా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు హెయిర్‌ స్టయిలిస్ట్ కోర్సులు చేసే వారు కూడా ఇచ్చి 'మసాయుకి' ఆశీర్వాదం తీసుకుంటారు. జపాన్‌లోని హెయిర్ డ్రెస్సింగ్, కాస్మెటిక్స్, హెయిర్ వాష్‌లు, హెయిర్ గ్రోత్ ప్రొడక్ట్స్, విగ్స్ కంపెనీలకు చెందిన యజమానులు, ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఆలయంలో 'ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి' విగ్రహం ప్రతిష్టించారు. అతను కామకురా కాలంలో 1185-1333 ప్రభుత్వానికి సేవ చేసిన హెయిర్ స్టైలిస్ట్. షోవా కాలం ప్రారంభం వరకు (1926-1989), జపాన్ అంతటా క్షురకులు, హెయిర్ స్టైలిస్ట్‌లు ప్రతి ఆయన వర్ధంతి రోజున తమ కార్యాలయాలను మూసివేసేవారు.

స్థానిక క్షురకులు, జపాన్ జాతీయ బ్యూటీషియన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, జుట్టు బలంగా ఉండేందుకు, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. అంతేకాదు కొందరు విదేశీ భక్తుల కూడా ఇక్కడికి వచ్చి తమ జుట్టును సమర్పించి, తమ జుట్టు పది కాలాలపాటు ఊడకుండా ఉండాలని కోరుకుంటారు. క్యోటోలో ఈ ఆలయం పరిసరాలు ఆహ్లాదకరంగా, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశంగా కూడా గుర్తించారు.

మికామి మందిరంలో పూజా విధానం సాధారణం కంటే భిన్నంగా ఉంటుంది. సందర్శకులు ఆలయ కార్యాలయంలో పూజారి ద్వారా ప్రత్యేక కత్తెరతో జుట్టు కత్తిరించి, జుట్టును ప్రత్యేక సంచిలో ఉంచి, ఆ సంచిని "మికామికి' సమర్పిస్తారు. దానం చేసిన వెంట్రుకలను పుణ్యక్షేత్ర ప్రాంగణంలోని "వెంట్రుకల దిబ్బ"కి తరలిస్తారు, అక్కడ ప్రజలు తమ జుట్టు ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తారు.

Updated On
ehatv

ehatv

Next Story