ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని మాతాంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని మాతాంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత(Mathangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani 2025)వినిపించారు. రాబోయే రోజుల్లో ఓ మహమ్మారి వెంటాడుతుందని, ప్రజలు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు జరుగుతాయని జోష్యం చెప్పారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోవడం లేదని అన్నారు. తనను మొక్కే వాళ్లు ఉండాలి, నిందలు వేసే వాళ్లు ఉండకూడదని చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించనని, కానీ రక్తం మాత్రం చూపిస్తానని తెలిపారు. పూజలను సక్రమంగా జరిపించాలని సూచించారు.

మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి(Secunderabad Ujjaini Mahankali) ఆలయ పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. పోతరాజుల విన్యాసాలు, బోనాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలతో కొత్త శోభ సంతరించుకొంది. దివ్యమంగళ స్వరూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ehatv

ehatv

Next Story