పరమ పవిత్రమైన కార్తిక మాసం(Karthika masam) చివరి ఘట్టానికి చేరుకున్నాం.
పరమ పవిత్రమైన కార్తిక మాసం(Karthika masam) చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మాసమంతా నదీస్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. కార్తిక వ్రతానికి పూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక మాసంలో చివరి రోజైన అమావాస్య(Karthika amavasya) రోజు చేయాల్సిన విధి విధానాలు..
సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలన్నీ పితృ దేవతల ప్రీతి కోసమే ఉంటాయి. పవిత్రమైన కార్తిక మాసంలో చేసిన స్నాన దాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక అమావాస్య రోజు పితృ దేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా కార్తిక అమావాస్య ఎప్పుడో తెలుసుకుందాం!
నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 నిమిషాల నుంచి అమావాస్య మొదలై డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11:51 నిమిషాల వరకు ఉంది. సాధారణంగా అమావాస్య తిథి రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు. అంతేకాకుండా పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ లెక్కన చూస్తే నవంబర్ 30 వ తేదీనే అమావాస్యగా జరుపుకోవాలని, ఈ రోజు శుక్రుడు, శని గ్రహాలు ఒకే సరళరేఖమీదకు వస్తారు. దీనివల్లే ఈరోజుకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. పంచాంగకర్తలు సూచిస్తున్నారు...
కార్తిక అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాలు(Karthika amavasya rituals)
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం(skanda puranam) ప్రకారం కార్తిక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానమాచరించాలి(River bath). సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలకు జల, తిల తర్పణాలు ఇవ్వాలి. సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి...