ఒక రోజు నైమిశారణ్యంలో శౌన కాది మహా మునులు కలిసి గురుతుల్యు లైన సూతమహర్షి తో ఇలాకోరారు.

ఒక రోజు నైమిశారణ్యంలో శౌన కాది మహా మునులు కలిసి గురుతుల్యు లైన సూతమహర్షి తో ఇలాకోరారు.ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణేతి హాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి. అని కోరారు. శౌనకాది మహామునుల కోరి కను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు.ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహా ముని బ్రహ్మ దేవు డిని కోరాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు అతనికి ఈ పురాణ విశేషా లను వివరించారు.అదేసమ యంలో లక్ష్మీదేవికి శ్రీ మహా విష్ణువు, పార్వతీ దేవికి పరమ శివుడు ఈ పురాణా న్ని వివరించారు. అలాంటి పరమ పవిత్ర మైన పురా ణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవు లకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంత నే ఇహలోకంలో, పరలోకం లో సకలైశ్వర్య ములు పొంద గలరు.కాబట్టిశ్రద్ధగావినండి. అని చెప్ప సాగాడు.పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వ రులు ఆకాశ మార్గంలో విహ రిస్తుండగా పార్వతి దేవి పరమ శివుడితో ప్రాణేశ్వరా సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవు లంతా కులమత తార తమ్యం లేకుండా, వర్ణ భేదాలు లేకుండా ఆచరించే వ్రత మేదైనా ఉంటే వివరిం చండి అని కోరింది.అంతట పరమ శివుడు ఆమె వైపు చిరు నవ్వుతో చూసి ఇలా చెబు తున్నాడు దేవీ నీవు అడిగే వ్రత మొక్కటి ఉంది. అది స్కంధ పురాణంలో ఉప పురాణంగా విరాజిల్లు తోంది. దానిని వశిష్ట మహాముని మిథిలా పురాధీశు డైన జనక మహా రాజుకు వివ రించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు.మిథిలా నగరంలో వశిష్టుడి రాకకు జనక మహా రాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్య పాద్యా లతో సత్క రించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగు తున్నాడు ఓ మహా ముని వర్యా మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రుల మయ్యాము. మీ పాద ధూళి తో నా దేశం పవిత్ర మైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణ మేమిటి అని కోరగా వశిష్ట మహా ముని ఇలా చెబు తున్నాడు జనక మహారాజా నేనొక మహా యజ్ఞముచేయా లని నిర్ణ యించాను. అందు కు కావాల్సిన ధన,సైన్యసహా యానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివ రించారు.దీనికి జనకుడు మునిపుంగవా అలాగేఇస్తాను స్వీకరించం డి.కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహ మున్నది. మీలాంటి దైవజ్ఞు లైన వారిని అడిగి సంశంయం తీర్చు కోవా లని అను కునే వాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవ కాశం దొరికింది. ఏడాది లోని మాసా లన్నింట్లో కార్తీకమాస మే ఎందుకు పరమ పవిత్ర మైనది.ఈ నెల గొప్పదన మేమిటి.కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థిం చారు.వశిష్ట మహాముని చిరు నవ్వు నవ్వి రాజ తప్పక నీ సందేహాన్ని తీర్చ గలను. నేను చెప్ప బోయే వ్రత కథ సకల మాన వాళి ఆచరించ దగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరి హర స్వరూపం. ఈ నెల లో ఆచరించే వ్రత ఫలితం ఇదీ అని చెప్పలేం. వినడా నికి కూడా ఆనంద దాయక మైనది.అంతేకాదు.ఈ కార్తీక మాస కథను విన్న వారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకం లోనూ, పర లోకం లోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వ జ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసు కోవడం శుభ ప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్ప సాగాడు.
కార్తీక వ్రతవిధానం
ఓ జనక మహారాజా, ఎవ రైనా ఏ వయసు వారైనా పేద ధనిక , తరతమ తారత మ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించ వచ్చు. సూర్య భగవానుడు తులా రాశిలో ఉండగా వేకువ జామున లేచి, కాల కృత్యాలు తీర్చుకుని, స్నాన మాచరించి, దాన ధర్మాలు, దేవతా పూజలు చేసి నట్ల యితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొంద గలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్ర నామార్చన, శివ లింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికిఅధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు.వ్రతవిధానం గురించి చెబుతూ *ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యో దయానికి ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నాన మాచ రించి గంగకు, శ్రీమన్నారయణ, పర మేశ్వరు లకు, బైరవుడికి నమ స్కరించి సంకల్పం చేసు కోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్య భగ వానుడికి అర్ఘ్య పాద్యాలను సమర్పించి , పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదు లైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్క నదిలో నైనా స్నానం చేసి నట్లయితే, గొప్ప ఫలితం లభి స్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహా విష్ణు వుకు ఇష్ట మైన పూలను తానే స్వయంగా కోసి తీసు కొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యా లతో భగవంతుని పూజ చేయాలి.గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టు కోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటి వద్ద గానీ, దేవాలయంలో గానీ, రావిచెట్టు మొదటగానీకూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి,శివాలయంలో గానీ,విష్ణు ఆలయంలో గానీ,తులసికోట వద్దగానీ, దీపారాధనచేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అంద రికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతి రోజు మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి. ఈ విధం గా వ్రతం చేసిన మహిళలు, మగ వారు గతంలో, గత జన్మలోచేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపా లను పోగొట్టు కుని మోక్షాన్ని పొందు తారు. ఈ వ్రతం చేయ డానికి అవకాశం లేని వారు, వీలు పడని వారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్క రించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. ఇది స్కాంద పురాణంలోని వశిష్ట మహా ముని చెప్పిన కార్తీక మహత్యం లోని మొదటి అధ్యాయం సమాప్తం.
