ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందె దరని చెప్పు చుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది.

దీపారాధన మహిమ
ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందె దరని చెప్పు చుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్య మైనవి యేమేమి చేయ వలయునో, ఎవరి నుద్దేశించి పూజ చేయ వలయునో వివరిం పుడు అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్ప దొడగిరి. జనకా కార్తీక మాస మందు సర్వ సత్కా ర్యము లనూ చేయ వచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును.సూర్యాస్త మయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయ మున శివ కేశవులు సన్నిధిని గాని ప్రాకారంబు నందు గాని దీప ముంచిన వారు సర్వ పాపము లను పోగొట్టు కొని వైకుంఠ ప్రాప్తి నొందు దురు. కార్తీక మాస మందు హరి హరాదులు సన్ని ధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని,విప్ప నూనెతో గాని,యేది దొరక నప్పుడు అముద ముతో గాని దీపము వెలి గించి వుంచ వలెను. దీపా రాధన యే నూనెతో చేసి ననూ మిగుల పుణ్యాత్ములు గాను భక్తి పరులు గాను నగుటయే గాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు.
పూర్వము పాంచాల దేశ మును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగు జెంది తీర మున నిష్ఠతో తప మాచరించుచుండగా నచ్చు టకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నివెందుల కింత తప మాచ రించు చున్నావు.నీ కోరిక యేమి యని ప్రశ్నించగా, ఋషిపుంగవా నాకు అష్ఠ ఐశ్వర్య ములు, రాజ్యము సంపదా వున్ననూ నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీతీర్ధ స్థాన మున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత ముని పున్గవుడు ఓయీ కార్తిక మాస మున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపా రాధనము చేసిన యెడల ని కోరిక నేరవేర గలదుయని చెప్పి వెడలి పోయెను.వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయ మున కార్తీక మాసము నెల రోజులూ దీపా రాధన చేయించి, దాన ధర్మా లతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచి పెట్టుచు, విడువకుండా నెల దినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భ వతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహుర్తమున నొక కుమారుని గనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవ ములు చేయించి, బ్రాహ్మణులకు దాన ధర్మాలు జేసి, ఆ బాలునకు శత్రుజయని నామ కరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపా రాధన వలన పుత్ర సంతానము కలిగి నందు వలన తన దేశ మంత టను ప్రతి సంవత్స రము కార్తీక మాస వ్రతములు, దీపా రాధన లు చేయు డని రాజు శాసిం చెను.రాకుమా రుడు శత్రుజి దిన దిన ప్రవర్థ మాను డగుచు సకల శాస్త్ర ములు చదివి, ధను ర్విద్య , కత్తి సాము మొద లగు నవి నేర్చు కొనెను.కాని, యవ్వ నము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లి తండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్క రించుచు, యెది రించిన వారిని దండించుచు తన కామవాంఛ తిర్చు కోను చుండెను.తల్లి తండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడ నట్లు విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్య ములో తన కార్యము లకు అడ్డు చెప్పు వార లను నరు కుదు నని కత్తి పట్టు కుని ప్రజ లను భయ కంపితు లను జేయు చుండెను. అటుల తిరుగు చుండగా నొక దిన మున నొక బ్రాహ్మణ పడు చును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు.ఆమె ఒక ఉత్తమ భార్య.మిగుల రూపవతి. ఆమె అంద చంద ములను వర్ణిం చుట మన్మ దున కైననూ శక్యము గాదు. అట్టి స్రీ కంట పడ గానే రాజ కుమారుని మతి మందగించి కోయ్య బోమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికార ముతో నామెను సమీ పించి తన కామ వాంఛ తెలియ చేసేను. ఆమె కూడా నాతని సౌదర్యా నికి ముగ్దు రాలై కులము,శిలమ,సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టు కొని తన శయన మంది రానికి తీసు కొని పొయి భోగము లనుభ వించెను.
ఇట్లు ఒకరి కొకరు ప్రేమలో పరవశు లగుట చేత వారు ప్రతి దినము నర్ద రాత్రి వేళ ఒక అజ్ఞాత స్థల ములో కలుసు కొనుచు తమ కామ వాంచ తీర్చు కొను చుండిరి.ఇటుల కొంత కాలం జరిగెను.ఎటు లనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి,బార్యనూ,రాజ కుమా రుని ఒకే సారిగా చంప వల యు నని నిశ్చ యించి ఒక ఖడ్గ మును సంపా దించి సమ యము కొరకు నిరీక్షించు చుండెను.ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికు లిరు వురు శివా లయ మును కలుసు కొన వలె నని నిర్ణ యించు కొని, యెవ రికి వారు రహస్య మార్గ మున బయలు దేరిరి. ఈ సంగతి యెటులో పసి గట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకు లిద్దరూ గుడిలో కలుసు కొని గాడాలింగన మొన ర్చు కొను సమయ మున చీకటిగా వున్నది,దీప ముండి న బాగుండును గదా,యని రాకుమారు డనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలి గెంచెను. తర్వాత వారిరు వురూ మహా నంద ముతో రతి క్రీడలు సలుపు టకు వుద్యుక్తు లగు చుండ గా, అదే యదనుగా నామె భర్త ,తన మొల నున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజ కుమా రుని ఖండించి తను కూడా పొడుచు కుని మరణిం చెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవార మగుట వల నను, ముగ్గు రునూ చని పోవుట వల ననూ శివ దూతలు ప్రేమికు లిరు వురిని తీసు కొని పోవు టకునూ, యమ దూతలు బ్రాహ్మణుని తీసు కొని పోవు టకును అక్క డకు వచ్చిరి. అంత యమ దూత లను చూచి బ్రాహ్మ ణుడు ఓ దూత లార నన్ను తీసు కొని వెళ్ళుటకు మీరెలా వచ్చి నారు. కామాంధ కార ముతో కన్ను మిన్ను తెలి యక పశు ప్రాయ ముగా వ్యవ హరిం చిన అ వ్యభి చారుల కొరకు శివ దూతలు విమాన ములో వచ్చు టేల. చిత్ర ముగా నున్నదే అని ప్రశ్నించెను.అంత యమ కింకరులు ఓ బాపడా ఎవ రెంతటి నీచు లైననూ, యీ పవిత్ర దినమున,అనగా, కార్తీక పౌర్ణమి సోమ వారపు దిన మున తెలిసో తెలి యకో శివాలయ ములో శివుని సన్ని దిన దీపం వేలి గించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపము లన్ని యును నశించి పోయినవి. కావున వారిని కైలాసము నకు తీసు కొని పోవుటకు శివధూతలు వచ్చినారు అని చెప్పగా యీ సంభాషణ మంతయు విను చున్న రాజ కుమారుడు అలా యెన్నటి కిని జరగ నివ్వను.తప్పొప్పులు యెలాగు నున్న ప్పటికి మేము ముగ్గుర మునూ ఒకే సమయ ములో ఒకే స్థల ములో మరణించి తిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తించవలసి నదే అని , తాము చేసిన దీపారాధన ఫల ములో కొంత అ బ్రాహ్మణు నకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిద్య మునకుజేర్చిరి. వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవు టయే గాక , కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాస ములో నక్షత్ర మాల యందు దీప ముంచిన వారు జన్మ రాహిత్య మొందు దురు.ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
నాలుగో అధ్యయము నాల్గవ రోజు పారాయణము సమాప్తం.


