ఓ జనక మహారాజా ,కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయ మునందు గాని, విష్ణాలయమునందు గాని, శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తి యగును.

వనబోజన మహిమ

కిరాత మూషికములు మోక్షము నొందుట

ఓ జనక మహారాజా ,కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయ మునందు గాని, విష్ణాలయమునందు గాని, శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠ మునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోక ములో నొక్క పద మైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందు దురు. కార్తీక మాస ములో పెద్ద ఉసిరి కాయ లతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామ మును యదోచితంగా పూజించి,విష్ణు మూర్తిని ధ్యానించి,ఉసిరిచెట్టు నీడన భుజించ వలెను.బ్రాహ్మ ణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలము లతో సత్కరించి నమస్కరించ వల యును. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయ వల యును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను యని వశిష్టుల వారు చెప్పిరి. అది విని జనక రాజు ముని వర్యా ఆ బ్రాహ్మణ యువకు నకు నీచ జన్మ మేల కలిగెను. దానికి గల కారణమేమి యని ప్రశ్నిం చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంబించిరి.

రాజా కావేరి తీర మందొక చిన్ని గ్రామ మున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానీ పేరు శివశర్మ .చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబ ముగా పెరుగుట వలన నీచ సహ వాస ములు చేసి దురా చార పరుడై మెలగు చుండెను. అతని దురచార ములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురా చారములు అంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధ ములుగా చెప్పు కొను చున్నారు.నన్ను నిలదీసి అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గు పడుతూ నలుగురిలో తిరగ లేక పోవు చున్నాను. కాన, నువ్వు కార్తీక మాస మున నదిలో స్నానం చేసి,శివ కేశవు లను స్మరించి,సాయం కాల సమయ మున దేవా లయ ములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాప ములు తొలగు టయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును.కాన,నీవు అటుల చేయు మని భోదించెను. అంతట కుమారుడు తండ్రీ స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానంచేసి పూజలుచేసి నంత మాత్రాన భగవంతుడు కనిపించునా. దేవాలయ ములో దీప ములు వెలి గించిన లాభ మేమి. వాటిని యింటి లోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకర్ధ ములతో పెడస రంగా సమా దాన మిచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రీ ఓరి నీచుడా కార్తీక మాస ఫలము నంత చులక నగా చుస్తు నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొర్ర యందు ఏలుక రూపములో బ్రతికే దవు గాక అని కుమారుని శపించెను.ఆ శాపంతో కుమారు డగు శివశర్మ కు జ్ఞానోదయమై బయ పడి తండ్రీ పాద ములపై బడి తండ్రీ క్షమింపుము. అజ్ఞా నంద కారంలో బడి దైవ మునూ,దైవ కార్యము లనూ యెంతో చులకన చేసి వాటి ప్రభాము లను గ్రహింప లేక పోతిని.ఇప్పు డు నాకు పశ్చాత్తా పము కలిగినది. కనక శాప విమో చన మోప్పుడు ఏవిద ముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివ రింపు మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ బిడ్డా నా శాప మును అనుభ వించు చు మూషిక మువై ఉండగా, నీవెప్పుడు కార్తీక మహత్య మును విన గలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తి నొందు దువు అని కుమారుని వూర డించెను. వెంటనే శివశర్మ ఏలుక రూపము పొంది అడ వికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివ సించుచు ఫలమును తినుచు జీవించు చుండెను.ఆ అడవి కావేరి నది తీరము నకు సమీప మున నుండు టచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వట వృక్షము నీడన కొంత సేపు విశ్రమించి,లోకాబి రామాయ ణము చర్చించు కొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాల మైన తరువాత కార్తీక మాస ములో ఓక రోజున మహర్షి యగు విశ్వా మిత్రుల వారు శిష్యా సమేత ముగా కావేరి నదిలో స్నానర్ధమై బయలు దేరి నారు.అట్లు బయలు దేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వట వృక్షం క్రింద నకు వచ్చి శిష్యు లకు కార్తీక పురాణ మును విని పించు చుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివ సించు చున్న మూషికము వీరి దగ్గర నున్న పూజా ద్రవ్యము లలో నేదైనా తినే వస్తువు దొరుకు తుందే మో నని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కి యుండెను.

అంతలో ఓక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని వీరు బాట సారులై వుందురు.వీరి వద్ద నున్న ధన మప హరించ వచ్చు ననెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారి పొయి నది. వారికీ నమస్క రించి మహాను భావు లారా తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి.మీ దివ్య దర్శనం తో నా మనస్సులో చెప్ప రాని ఆనందము కలుగు చున్నది.గాన వివరింపుడు అని ప్రాదేయ పడెను. అంత విశ్వా మిత్రుల వారు ఓయి కిరాతకా మేము కావేరినది స్నాన ర్దామై ఈ ప్రాంతము నకు వచ్చితిమి.స్నానమాచ రించి కార్తీక పురాణ మును పఠింన్చు చున్నాము. నీవు ను యిచట కూర్చుని సావ దానుడవై ఆల కింపుము అని చెప్పిరి. అటుల కిరాత కుడు కార్తీక మహత్య మును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకము నకు వచ్చి, పురాణ శ్రవణా నంత రము వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారము నకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంత యు విను చుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ముని వర్యా ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంత మంతయు చెప్పి వెడలి పోయెను. కనుక జనకా ఇహములో సిరి సంపదలు, పర లోక మున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణ మును చదివి, యితరులకు విని పించ వలెను.

ఇట్లు స్కాంద పురాణాంత ర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి ఐదవ అధ్యయము, ఐదవ రోజు పారాయణము సమాప్తం.

Updated On 26 Oct 2025 2:30 AM GMT
ehatv

ehatv

Next Story