మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా దైవభక్తి ఉంటుంది.

మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా దైవభక్తి ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు రుజువయ్యింది కూడా! లేటెస్ట్‌గా హైదరాబాద్‌ శివారులో ఉన్న కీసరగుట్ట(Keesaragutta) రామలింగేశ్వరస్వామి ఆలయంలో(Ramalingeshwara swamy temple) ఇలాంటి ఘటన చోటు చేసుకున్నది. కార్తీక మాసం(Karthika masam) కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటేత్తుతున్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు భక్తులు పూజలు చేశారు. అదే సమయంలో ఓ కోతి శివలింగానికి ప్రణమిల్లింది. తన్మయత్వంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story